ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా… కందుకూరు పట్టణంలోని 16వ వార్డు పరిధిలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ఉదయం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యుదయ స్కూల్, తేలప్రోలు వారివీధి, గ్రంథాలయం ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి…. ఈ రెండేళ్లలో మున్సిపాలిటీ పరిధిలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని, మునిసిపాలిటీలో రోడ్ల విస్తరణ చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా ట్రాఫిక్ నివారణకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, అన్ని వార్డుల్లో పెద్ద ఎత్తున సిసి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపాలిటీలో 120 కోట్లతో పనులు జరగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారాయణ గారి సహకారం ఎంతో ఉందన్నారు.
కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం ద్వారా వైసిపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే… ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తాము తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపామని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు. అమృత్ 2.0 పథకం ద్వారా శివారు ప్రాంతాలకు త్రాగు నీటి సరఫరా, మురికి నీటిని వాడుక నీటిగా మార్చే ఎస్టిపి ప్లాంట్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే పురాతన డ్రైనేజీ కాలువల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు నాగేశ్వరరావు చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతాయని, మొత్తంగా కందుకూరు పట్టణాన్ని మోడల్ టౌన్ గా మార్చేంతవరకు 24 గంటలు కష్టపడుతూ ముందుకు వెళుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రతి ఇంటికి అందుతున్న సంక్షేమ పథకాలు, ఆరోగ్య ఇబ్బందులు తెలుసుకుంటూ ఎమ్మెల్యే గారి పర్యటన సాగింది. చిరునవ్వులు, పలకరింపులతో సుమారు 50 ఇళ్లకు వెళ్లిన ఆయన… ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎలా ఉన్నారు అని యోగక్షమాలు తెలుసుకుంటూ… కూటమి ప్రభుత్వ పాలన గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మున్సిపల్ డిఈ గణపతి, వార్డు అధ్యక్షులు కొత్త నరేంద్ర, ఏఎంసి డైరెక్టర్ కొత్తూరి వెంకట సుధాకర్, మురారిశెట్టి వెంకట సుబ్బారావు, అన్న క్యాంటీన్ సభ్యులు కాకుమాని ప్రవీణ్, కంకణాల వెంకటేశ్వర్లు, ఇస్కాల మధు, ఇన్నమూరి నరసింహం, వాసు, అల్లూరయ్య, చిట్టి, సుబ్బరాయుడు, రామకృష్ణ, తోట సురేష్, పట్టణ మాజీ అధ్యక్షులు పిడికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీను, క్లస్టర్ ఇంచార్జ్ వడ్డెళ్ళ రవిచంద్ర, యూనిట్ ఇంచార్జి కోటపూరి శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర కమిటీ నాయకులు బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, నియోజవర్గ కమిటీ నాయకులు కల్లూరి శైలజ, అల్లం వెంకటేశ్వర్లు, రాయపాటి శ్రీను, అన్ని వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.