పట్టణంలో పామూరు రోడ్ లో కెనరా బ్యాంకు ఎదురుగా మద్యం మత్తులో రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న ఓ వృద్ధుడికి టౌన్ ఎస్ఐ బండ్ల భార్గవ్ మానవత్వం చాటి సహాయం చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని పరిశీలించారు వృద్ధుడికి అవసరమైన ప్రాథమిక సహాయం అందించడంతో పాటు, అతడిని సురక్షిత ప్రదేశానికి తరలించి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు అనంతరం అతని కుటుంబ సభ్యులను గుర్తించి సమాచారం అందించారు ఈ సందర్భంగా ప్రజలు ఎస్ఐ చూపిన మానవత్వాన్ని అభినందించారు. పోలీసుల విధి నిర్వహణలో భాగంగానే కాకుండా మానవీయ కోణంలో స్పందించి ప్రాణాలకు భరోసా కల్పించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *