జూదం కోడి పందెం మాదక ద్రవ్యాల చెలామణి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా పందెం రాయుళ్ళు పెడచెవిన పెట్టడం తో కోడి పందెం నియంత్రణ టాస్క్ ఫోర్స్ మంగళ వారం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడులు చేపట్టింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశాలు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణ లో జిల్లా టాస్క్ ఫోర్స్ పెట్టిన నిఘా లో అందిన సమాచారం తో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు చేపట్టింది. ఈ దాడికి సిఐ కమలాకర్, ఎస్సై చెంచయ్య, ఎ ఎస్సై మహబూబ్ బాషా తమ బృందం తో రంగంలో దిగారు. ప్రకాశంజిల్లా సింగరాయకొండ పోలీస్ పరిధిలోని బంగినపల్లి గ్రామ శివారు లోని ఉప్పు కొటారు పొలాల్లో పేకాట ఆడుతున్న శిబిరం పై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పందెం రాయుళ్ళ తో పాటు వారి వద్ద నుండి 12 వేల 200 నగదు, ఆరు సెల్ ఫోన్లు, రెండు మోటారు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నేరం పై వారి మీద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకున్న పందెం రాయుళ్ళు, వారి వద్దనుండి స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్ లు, మోటార్ సైకిళ్లను పేకాట నియంత్రణ టాస్క్ ఫోర్స్ అధికారులు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో పప్పగించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *