తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసులు పాఠశాల విద్యార్థుల కోసం సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల నివారణ, మహిళల భద్రత, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, పోక్సో (POCSO) చట్టం, ఈవ్ టీజింగ్ నివారణ, సైబర్ నేరాలు, సైబర్ మోసాల నుంచి రక్షణ, రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల (NDPS) దుష్పరిణామాలు, మహిళలపై నేరాల నివారణ వంటి కీలక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులతో ప్రత్యక్షంగా మమేకమై చట్టాల ప్రాముఖ్యత, వాటి ఉల్లంఘన వల్ల ఎదురయ్యే శిక్షలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ మోసాల నుంచి రక్షణ పొందే మార్గాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. అలాగే మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఏదైనా నేరం లేదా అనుమానాస్పద ఘటన గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.విద్యార్థులు చట్టాలపై అవగాహనతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి, సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.