టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి), కందుకూరు నందు 2026- 27 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం బీఎ, బీఎస్సీ, బీకాం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. మొదటి దఫా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు11 వ తారీకు వరకు తమ కళాశాలలో జరుగుతుందని ఆయన తెలియజేశారు. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఒక అటానమస్ (స్వయం ప్రతిపత్తి) కళాశాల కావున విద్యార్థినీ విద్యార్థుల బహుముఖ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కళాశాలలో బోధన ఉంటుందని, అధ్యాపకులు అందరూ కూడా 15 నుంచి 25 సంవత్సరాల అనుభవం కలిగిన వారని ప్రిన్సిపాల్ తెలియజేశారు.కందుకూరు మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే తమ సర్టిఫికెట్స్ లతో కళాశాలలో రిజిస్టర్ చేసుకోగలరని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *