మార్కాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని మదర్ ఇండియా మోడరన్ రైస్ మిల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన తక్కువ ధరకు సన్న బియ్యం విక్రయాల (రైస్ మార్ట్) కార్యక్రమాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు.ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.అనంతరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిస్థితిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, గతంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ప్రస్తుతం వైభవం కోల్పోయి నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను కోరారు.కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పఠాన్ ఖాన్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *