తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
90 ఏళ్లుగా రైతులు సాగు చేస్తున్న భూముల హక్కులను వారికి తిరిగి అందిస్తాం. గత ప్రభుత్వ రీ సర్వేలో ప్రభుత్వ భూముల జాబితాలో చేరిన సుమారు 400 ఎకరాల సమస్యను గ్రామసభ నిర్వహించి పరిష్కరిస్తాం. అవసరమైతే ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందేలా కృషి చేస్తాను.గురువారం ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో భాగంగా కొత్తవంగల్లులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నాను. గత రెండేళ్లలో గ్రామంలో రూ.4.24 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పనులు పూర్తి చేశాం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.1.34 కోట్లతో పనులు చేపట్టాం.సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా పనిచేస్తున్నాం. గ్రామ ప్రజలు కోరిన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కూడా సీఎస్‌ఆర్ నిధులతో రూ.10 లక్షలు కేటాయించి పనులు ప్రారంభిస్తాం.ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. అభివృద్ధి, సంక్షేమం, రైతుల హక్కుల పరిరక్షణ కోసం నా కృషి నిరంతరం కొనసాగుతుంది.