ప్రజల సమస్యలను నేరుగా చూసి పరిష్కరించాలనే చిత్తశుద్ధితో పంగులూరు మండలం టి. కొప్పరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు గారు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు.
ప్రధాన ముఖ్యాంశాలు:
పారిశుధ్యం & డ్రైనేజీ: అంగన్వాడీ కేంద్రం వద్ద డ్రైనేజీ సమస్య అధిగమించేందుకు ‘మ్యాజిక్ డ్రైన్స్’ ఏర్పాటుకు ఆదేశాలు.రైతుల హక్కులు: పొలాలకు వెళ్లే దారి రైతుల ప్రాథమిక హక్కు (“ఈజ్ ఆఫ్ యాక్సెస్”). ప్రజల ఆస్తులపై ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యాన్ని సహించేది లేదని హెచ్చరిక.తాగునీరు: జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా RWS మరియు MPDO అధికారులకు ఆదేశాలు.అర్జీల పరిష్కారం: నాన్-ఫైనాన్స్ సమస్యలను తక్షణమే, ఫైనాన్స్ ఆధారిత సమస్యలను ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి.అనంతరం గ్రామ సచివాలయ ఆవరణలో పచ్చదనం పెంపొందించేందుకు కలెక్టర్ గారు మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో RDO, డ్వామా, DRDA మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *