తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన IAB సమావేశంలో కోవూరు రైతుల సాగునీటి అవసరాలపై చర్చించాను.కోవూరులో సుమారు లక్ష ఎకరాల సాగుకు సెప్టెంబర్ 30 వరకు నీరు అందించాలని కోరాను. నీటిని పొదుపుగా వినియోగిస్తూ చివరి ఆయకట్టు వరకు ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరాను.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో పంటకు రామతీర్థం వరకు నీరు అందిస్తున్నాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించడమే మా లక్ష్యం.అలాగే లస్కర్లకు సకాలంలో జీతాలు చెల్లించాలని అధికారులను కోరాను.రైతు పొలానికి నీరు.. రైతు కుటుంబానికి భరోసా.. ఇదే మా సంకల్పం.