దొర్నాల మండలం యడవల్లి గ్రామంలో దొర్నాల పోలీసులు జూద స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న 12 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి ₹3,200 నగదు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది.జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దొర్నాల పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *