కోవూరు MRO కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 939 మంది రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను, 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలను అందించాను.కోవూరు గ్రామంలో 5,554 ఎకరాలకు రీసర్వే పూర్తి చేసి, 3,917 ఎకరాల పట్టా భూములకు సంబంధించిన రైతులకు ఈ పాసుపుస్తకాలు అందించాం. ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించిన ఈ పాసుపుస్తకాలు రైతుల భూమి హక్కులకు మరింత భరోసా కల్పిస్తాయి.అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రైతులకు రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందిస్తున్నాం. 22(A)లో ఉన్న పట్టా భూముల సమస్యలను కూడా వేగంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.అలాగే ఇటుక బట్టీల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న 50 మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించడం ఆనందంగా ఉంది. వారికి ప్రభుత్వం తరఫున, VPR ఫౌండేషన్ తరఫున అండగా ఉంటాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *