మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు.కంభం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందులాపురం కాలనీ, బి.వీ.పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కనిగిరి బొగ్గుల కాలనీ, కొమరోలు మండలం గుండ్లరెడ్డిపల్లి గ్రామం, మార్కాపురం డ్రైవర్స్ కాలనీ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇళ్లను, వాహనాలను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు మరియు అక్రమ కార్యకలాపాలపై వివరాలు సేకరించారు. గుండ్లరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక ప్రజలతో మాట్లాడి రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలు, దొంగతనాలపై అవగాహన కల్పించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *