దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాలతో చనిపోయిన పేద విద్యార్థుల కుటుంబాలకు స్వాoతన పథకంతో కూటమి ప్రభుత్వం బాసటగా నిలిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అనారోగ్య సమస్యలతో దురదృష్టవశాత్తు చనిపోయిన అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులకు మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రి స్వాoతన చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో విద్యార్థికి రూ. 3 లక్షల చొప్పున 7 మంది విద్యార్థుల కుటుంబాలకు రూ. 21 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో రూ.5 కోట్లతో కార్పస్ నిధితో స్వాoతన పథకం తీసుకొచ్చాం. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అనారోగ్యానికి గురైన విద్యార్థులను వెంటనే గుర్తించి సకాలంలో కార్పోరేట్ వైద్యం అందిస్తున్నాం. దురదృష్టవశాత్తు చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు బాసటగా స్వాoతన పథకంతో రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇప్పటివరకు 11 మంది విద్యార్థుల కుటుంబాలకు బాసటగా రూ. 33 లక్షల విలువైన స్వాoతన చెక్కులు పంపిణీ చేశాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ పేద విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదు. పేద విద్యార్థుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. తల్లిదండ్రులు తమ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు తమ ప్రేమానురాగాలకు దూరంగా హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనుందించడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చాక గురుకులాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *