తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాల ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం తదితర అంశాలను పరిశీలించారు.రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.