తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ప్రకాశం జిల్లాలో సిబిఐ,ఏసీబీ వరుస దాడులతో అధికారుల్లో కలకలం.. మార్కాపురం జిల్లాలోనూ అవినీతి అధికారుల్లో వణుకు ఒంగోలులో ఒకేరోజు రెండు చోట్ల సిబిఐ,ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడంతో ప్రకాశం జిల్లాలో అధికార వర్గాల్లో కలకలం రేగింది. అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఏసీబీ నిఘా కొనసాగుతుండటంతో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది.ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ పరిణామాల ప్రభావం పక్కనే ఉన్న మార్కాపురం జిల్లాపైనా కనిపిస్తోంది. ఇప్పటికే అవినీతి, లంచాల వ్యవహారాలపై ఏసీబీ దృష్టి సారించడంతో మార్కాపురం జిల్లాలోని పలువురు అధికారులు, సిబ్బందిలోనూ వణుకు మొదలైందనే చర్చ సాగుతోంది.ఏసీబీ నిఘా ఎవరిపై..? తదుపరి టార్గెట్ ఎవరు..? అనే అంశం ప్రస్తుతం అధికార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.