మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు కంభం సర్కిల్ సీఐ, కంభం ఎస్‌ఐ, బి.వీ.పేట ఎస్‌ఐ మరియు సర్కిల్ సిబ్బంది కలిసి కంభం కందులాపురం కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలోని అన్ని ఇళ్లకు సంబంధించిన వ్యక్తుల వివరాలను, పూర్వ చరిత్రను పరిశీలించి, వాహనాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ఎటువంటి నిషేధిత వస్తువులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు.మొత్తం 23 వాహనాలను అదుపులోకి తీసుకుని, వాటి రికార్డులను పరిశీలించిన అనంతరం యజమానులకు తిరిగి అప్పగించారు. అలాగే యజమానులు/హక్కుదారులు లేని 2 అనాధ వాహనాలను గుర్తించి, సెక్షన్ 102 Cr.P.C. ప్రకారం స్వాధీనం చేసుకున్నారు.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *