తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
చందవరం గ్రామ పంచాయతీ పరిధిలోని దేసిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ నాగ స్వరూపమ్మ తల్లి వారి కులుపుల కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – డా కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా గ్రామ నాయకులు, ప్రజలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ – లలిత్ సాగర్ గార్ల దంపతులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మోడీ వెంకటేశ్వర్లు, రమణ యాదవ్, చందవరం, దేసిరెడ్డిపల్లి గ్రామ టీడీపీ నాయకులు, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, ప్రజలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.