రోజు రోజుకు ఫోటో గ్రాఫి రంగం లో వస్తున్న మార్పులు సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం తో గ్రామీణ ప్రాంతాల లో జీవించే వృత్తి ఫోటో గ్రాఫర్ లు వీడియో గ్రాఫర్ ల కుటుంబ సంక్షేమం అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని సంఘం సింగరాయకొండ అధ్యక్షుడు రాజేష్ విజ్ఞప్తి చేశారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ లో చేపట్టిన ర్యాలీ, అనంతరం జరిగిన కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ ముండే డాగ్యురి ఫోటో కి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫోటో గ్రాఫర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబాల సంక్షేమం అభివృద్ధి గురించి చర్చించారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల వృత్తి ఫోటో గ్రాఫర్ లు వీడియో గ్రాఫర్ ల సంక్షేమానికి అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఫోటో గ్రాఫర్ లు గ్రామం లో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సంఘం నాయకులు ఉపాధ్యక్షుడు సాయి మధు, కార్యదర్శి శ్రీకాంత్,మాజీ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్,సభ్యులు కాసుల శ్రీను, రవీంద్ర, వెంకట్,నాగరాజు, ,ప్రదీప్, నాగేంద్ర, అరవింద్,భాను తేజ, నవీన్,గోపి, వెంకటేశ్వర్లు, మాలి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *