ప్రకాశం జిల్లా, సింగరాయకొండ సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేశారు. దేవస్థాన పాలక మండలి సభ్యులు శ్రీ సన్నెబోయిన శ్రీనివాసుల నాయుడు, దేవస్థాన వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.స్వామివారి నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *