ప్రకాశం జిల్లా ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాత్రివేళల్లో నేరాలను అరికట్టేందుకు పట్టణాలు, గ్రామాలు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై పోలీసులు ప్రత్యేకంగా ‘నైట్ బీట్’ నిర్వహిస్తున్నారు.రాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను పోలీసులు తనిఖీ చేస్తూ, వారి వివరాలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిశీలిస్తున్నారు. అవసరమైన సందర్భాల్లో వేలిముద్రలను సైతం పరిశీలించి నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.తాళం వేసి ఉన్న ఇళ్లు, బ్యాంకులు, ఏటీఎంలు, పెట్రోల్ బంకులు, వ్యాపార సముదాయాలు మరియు ఇతర సున్నిత ప్రాంతాల వద్ద పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తున్నారు.నైట్ బీట్ ద్వారా దొంగతనాలు, చోరీలు మరియు ఇతర రాత్రివేళ నేరాలను ముందస్తుగా నివారించడంతో పాటు, నేరగాళ్ల కదలికలకు అడ్డుకట్ట వేస్తున్నారు.ప్రజలు కూడా తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని, ప్రజల భద్రత కోసం ప్రకాశం జిల్లా పోలీసులు 24/7 అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *