కూటమి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గౌరవ కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. మంగళవారం కందుకూరు మండలంలోని మాచవరం గ్రామంలో… NTR భరోసా పింఛన్ల పంపిణీ మరియు రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు.
గ్రామ శివారులోని ఎస్టీ కాలనీ, కొండదగ్గర ఎస్టీ, బీసీ కాలనీల్లో వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయడంతో పాటు…. రాష్ట్రం మరియు కందుకూరు నియోజకవర్గంలో గడచిన రెండేళ్లలో జరిగిన ప్రగతిని వివరించారు. MLA గారు మాట్లాడుతూ…రెండేళ్ల కాలంలో మాచవరం పంచాయతీలో 17.35 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం.గ్రామంలో ప్రతినెలా 845 మంది లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో 34 లక్షలు అందిస్తున్నాం. 143 మహిళా పొదుపు గ్రూపులకు 10.47 కోట్ల రుణాలు అందించాం. జిరాంజీ ఉపాధి హామీ పథకం ద్వారా 1.4 కోట్లను కూలీల ఖాతాల్లో వేసాం. తల్లికి వందనం పథకం ద్వారా 501 మంది తల్లుల ఖాతాల్లో 1.5 కోట్లు, దీపం పథకం ద్వారా 52.19 లక్షలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 880 మంది రైతులకు 2.37 కోట్లు అందించాం. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా 6 గురికి 9 లక్షలు ఇచ్చాం. గత ఏడాది 10.3 లక్షలతో 5 గోకులం షెడ్లు నిర్మించగా, ఈ ఏడాది 4 మంజూరయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పార్టీలకతీతంగా 21 మంది పేదలకు 16.66 లక్షలు సహాయం అందించాం. గ్రామంలో 10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించడంతోపాటు తాగునీటి వసతుల కోసం 6 లక్షలకు పైగా ఖర్చు చేసాం.సాగునీటి కోసం చెరువుకు వచ్చే కాలువ రిపేర్లు, పంట కాలువలు మరియు పాటి కాలువ అభివృద్ధి కోసం 14.5 లక్షలు మంజూరు చేసాం. రాజకీయాలలో మార్పును ఆహ్వానించాలని గ్రామస్తులను కోరుతున్నాను. భయం వదిలి బయటకు రండి. ఏ సమస్య ఉన్నా నేరుగా నా దగ్గరకు నేరుగా రావచ్చు. పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను….అని ఇంటూరి నాగేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. త్వరలో ఎస్సీ కాలనీవాసులకు పట్టాలు పంపిణీ చేయబోతున్నాం.గత ప్రభుత్వంలో పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం చూశారు. చిన్నచిన్న పనులకుకూడా డబ్బులు ఉండేవి కావు. కూటమి ప్రభుత్వం ఇస్తున్న నిధులతో గ్రామాలలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి… అని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు.మాచవరం గ్రామ పర్యటనలో ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు ఘన స్వాగతం లభించింది. పూలు, తప్పెట్లతో ఆయనకు పలు కాలనీలవాసులు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ గొంది నరసింగరావు, స్థానిక నాయకులు సూరం చిరంజీవిరెడ్డి, సాదినేని మాల్యాద్రి, రావూరి మహేంద్ర, ఇనకల్లు సుబ్రహ్మణ్యం, అనంత రాగయ్య, శేషయ్య, పరుచూరి మాధవ, బీరం వాసు, లక్ష్మీనారాయణ, తన్నీరు అయ్యలు, చొప్పర మోహన్, ఎండ్లూరి శరత్, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *