ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జిల్లాలోని రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్‌ స్టాండ్లు మరియు ఇతర రద్దీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు, లగేజీ, ఇతర సామగ్రిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.ప్రజా రద్దీ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ, అనుమానాస్పద వస్తువులు కనిపించినప్పుడు తక్షణమే స్పందించేలా పోలీసు బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని, తమ లగేజీని జాగ్రత్తగా చూసుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తుల వస్తువులను తీసుకెళ్లవద్దని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం – నేరాల నివారణకు నిరంతర నిఘా, కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతాయి.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *