తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
నా స్వగ్రామమైన వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెంలో రూ.21 లక్షలతో అభివృద్ధి చేసిన హిందూ స్మశానవాటికను సబ్ కలెక్టర్ శ్రీ దామెర హిమవంశీ గారు, అధికారులతో కలిసి ప్రారంభించడం ఆనందంగా ఉంది.ఈ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేయగా, రూ.6 లక్షలను నా సొంత నిధులతో సమకూర్చాను.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అన్ని సామాజిక వర్గాలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం.అనంతరం అధికారులతో కలిసి పెద్దసంఖ్యలో మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించే కార్యక్రమంలో పాల్గొన్నాను.ప్రజా అవసరాలే ప్రథమ ప్రాధాన్యం.. అభివృద్ధే మా లక్ష్యం..