తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ నుంచి రామనాథపురం మీదుగా నందనవనం వరకు రూ.1 కోటి 73 లక్షల నిధులతో తారురోడ్డు పటిష్టపరిచే పనులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కొండపి నియోజకవర్గానికి రూ.22 కోట్లతో 9 రహదారులు మంజూరయ్యాయని తెలిపారు.కొండపి నియోజకవర్గంలో మెరుగైన రహదారులు, మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు స్పష్టం చేశారు.