టి.ఆర్.ఆర్. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాల, కందుకూరులో కేంద్ర MSME మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్ర ప్రదేశ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్, RAMP పథకం కింద ESDP శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని Thredz IT సంస్థ, ప్రకాశం జిల్లా పారిశ్రామిక కేంద్రం (DIC) సహకారంతో నిర్వహిస్తోంది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, డా. ఎం. రవి కుమార్ మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో కేవలం డిగ్రీతో ఉద్యోగం రావడం కష్టమని, ప్రతి విద్యార్థి ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు వృత్తి నైపుణ్యాలు నేర్చుకోవడం తప్పనిసరి అని అన్నారు. యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తున్నాయని తెలిపారు.కళాశాలలో ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్, బేకరీ తయారీ, సెల్ ఫోన్ రిపేరింగ్ అనే నాలుగు కోర్సులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, మూడు వారాల పాటు నిపుణులచే శిక్షణ ఇవ్వబడుతుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలని పిలుపునిచ్చారు.అనంతరం MSME ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ప్రోగ్రాం రాష్ట్ర కో-ఆర్డినేటర్, ఆంజనేయులు నాయక్ శిక్షణా వివరాలు, ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ప్రాజెక్ట్ రిపోర్టుల తయారీ మరియు మార్కెటింగ్ సౌకర్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మెంటార్లు మరియు కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *