రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి – ట్రాఫిక్ నిబంధనల అమలుతో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్, వాహనాల నంబర్ ప్లేట్లు తదితర అంశాలను పరిశీలించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వారిపై, ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం మరియు ఇతర ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించవద్దని అవగాహన కల్పించారు.ప్రజల ప్రాణాలను కాపాడటం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సురక్షితమైన ప్రయాణాన్ని అందించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం.. సురక్షితంగా గమ్యం చేరుదాం!