తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పాఠశాలలో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఆరో (RO) వాటర్ ప్లాంట్ గత కొన్ని రోజులుగా సాంకేతిక లోపంతో పనిచేయక నిలిచిపోయిన సంగతి మీకు తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, ఈ సమస్య మీ దృష్టికి వచ్చిన వెంటనే మీరు ఉదార మనస్సుతో స్పందించడం ఎంతో అభినందనీయం.మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ₹21,500/- (ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు) ఆర్థిక సాయాన్ని అందించి, మన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుల (P.D. గార్ల ) ప్రత్యక్ష పర్యవేక్షణలో RO ప్లాంట్‌కు పునర్వైభవం తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆరో ప్లాంట్ సక్రమంగా పనిచేస్తూ, విద్యార్థులందరికీ స్వచ్ఛమైన మరియు సురక్షితమైన ల్యాబ్ ప్రమాణాల ప్యూరిఫైడ్ తాగునీరు తగినంతగా అందుబాటులోకి వచ్చింది.పాఠశాల వదిలి దశాబ్దాలు గడిచినా, మీరు చదువుకున్న విద్యాసంస్థపై మీకున్న మమకారం, సామాజిక బాధ్యత మరియు ప్రస్తుత విద్యార్థుల పట్ల చూపిన వాత్సల్యం ఎంతో ఆదర్శనీయం. మీ ఈ నిస్వార్థ సేవ వర్తమాన విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.
పాఠశాల వికాసంలో భాగస్వాములైన 1973-74 పూర్వ విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. మీ కుటుంబాలకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాము.
ధన్యవాదములతో