బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించిన ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు శుక్రవారం కందుకూరులో బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నారు.
కందుకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వివిధ బ్యాంకుల ఉద్యోగులు, అధికారులు పాల్గొని తమ డిమాండ్లకు మద్దతుగా నినాదాలు చేశారు. 5-Day Banking అమలు చేయాలని, వివక్షతతో కూడిన PLI విధానాన్ని ఉపసంహరించుకోవాలని, యూనియన్లతో ద్వైపాక్షిక చర్చల ద్వారా PLI విధానంలో అవసరమైన మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బ్యాంకు ఉద్యోగులు ప్రతిరోజూ ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ బ్యాంకింగ్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయడం సముచితమని పేర్కొన్నారు.
2024 మార్చిలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో ఐదు రోజుల బ్యాంకింగ్‌కు సంబంధించిన అంశం ఉన్నప్పటికీ, దాని అమలుకు తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉందని యూనియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
“ఐదు రోజుల బ్యాంకింగ్ మా న్యాయమైన హక్కు — వెంటనే అమలు చేయాలి”,
“ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి”,
“వివక్షతతో కూడిన PLI విధానాన్ని ఉపసంహరించుకోవాలి” అంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.
బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని నాయకులు కోరారు.ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు: P. కోటేశ్వర రావు – SBI పెన్షనర్ అసోసియేషన్,కిరణ్ కుమార్ బొమ్మల – SBI RBO కందుకూరు లోకల్ సెక్రటరీ, గాయత్రి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాధవ రావు – పొన్నలూరు లోకల్ సెక్రటరీ, P. నరేష్ – కందుకూరు మెయిన్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, కరీం బాషా – కనిగిరి మెయిన్ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, సాదిక్ – తిమ్మారెడ్డిపల్లి బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, వీర బ్రహ్మం – పామూరు బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, C. మహేష్ – కరేడు బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, N. రాజేంద్ర ప్రసాద్ – సింగరాయకొండ బ్రాంచ్ లోకల్ సెక్రటరీ. V. శ్రీకాంత్ – పాకాల బ్రాంచ్, భాగ్యరాజ్- ఉలవపాడు బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, A. కిశోర్ – చాకిచర్ల బ్రాంచ్, రమేష్ నాయక్- పొకురు బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, Ch. నాగార్జున – వలేటివారి పాలెం బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, G. భరత్ – మాచవరం బ్రాంచ్ లోకల్ సెక్రటరీ, K. గోపి- టౌన్ కందుకూరు లోకల్ సెక్రటరీ, ఖాజా రసూల్ – టౌన్ కనిగిరి బ్రాంచ్, ఏ . నారాయణ స్వామి – కరేడు బ్రాంచ్,శ్రీ భవానీ శంకర్ – కొండపి బ్రాంచ్ లోకల్ సెక్రటరీ.సెప్టెంబర్ నెలలో 28,29 30 తేదీ లలో జరగబోవు మూడు రోజుల సమ్మెను కూడా ఇంతే ఉత్సాహం తో ఉదృతంగ చేసి మా ప్రధాన డిమాండ్ అయ్యిన 5 రోజుల పని దినాల ను సాధిస్తామని
కిరణ్ కుమార్ తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *