యువత భవితకు భరోసా కార్యక్రమాన్ని కందుకూరులోని శ్రీ వివేక జూనియర్ కాలేజీలో సోమవారం నిర్వహించారు. ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని, పారిశ్రామిక ప్రగతి వేగంగా జరుగుతోందని ఎంపీ చెప్పారు. కందుకూరు ప్రాంతంలో రామాయపట్నం పోర్టు, బిపిసిఎల్, ఇండోసోల్ మరియు వాటి అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయని, లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *