ప్రకాశం జిల్లావ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అన్ని మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయాలు, నామినేషన్ల పరిశీలన కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.నామినేషన్ల పరిశీలన కేంద్రాల పరిసరాల్లో అమల్లో 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ను కఠినంగా అమలు చేస్తూ, అనధికార వ్యక్తులు లోపలికి ప్రవేశించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ఘర్షణలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి, బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేశారు.నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో పాల్గొనే అధికారులు, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *