తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండల డెవలప్మెంట్ కార్యాలయం నందు 09.05.2026 న బాలల బంగారు భవిష్యత్ వైపు అనే కార్యక్రమము జరిగినది . ఈ కార్యక్రములలో M.D.O, M.R.O గారు పాల్గొనినారు. M.D.O గారు మాట్లాడుతూ బంగారు బాల్యం సాధికారిత మరియు వారి హక్కులను గురించి వివరించారు . బాల్య వివాహాల ద్వారా జరిగే అనర్ధాలను , పిల్లలను బాల్యంలోనే బాల కార్మికులు లాగా తయారు చేయకుండా పాఠశాలకు పంపించాలి వారిని ఉన్నతమైనవారుగా తీర్చిదిద్దలి అని బాల్య వివాహాలను నిషేధించాలి అని పిల్లలకు అంటు వ్యాధులు రాకుండా క్రమంగా టీకాలను స్థానిక అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దలి అని తెలియజేసినారు . ఈ కార్యక్రమములో భాగంగా మండల కార్యాలయం వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమములో I.C.D.S ,సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్తకర్తలు , A.N.M లు ,అశావర్కర్లు పాల్గొనినారు .