తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్తి నేరాల నివారణకు బంగారు వ్యాపారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు. ఈ మేరకు పట్టణంలోని బంగారు వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి భద్రతా చర్యలపై కీలక సూచనలు జారీ చేశారు.దుకాణాల వద్ద నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండడం, నమ్మకమైన సిబ్బందినే నియమించుకోవడం, రాత్రివేళ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉంచడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు లేదా వ్యక్తులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజల ఆస్తుల రక్షణ, నేరాల నివారణలో వ్యాపారుల సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, భద్రతపై రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు.