తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
వలేటివారిపాలెం మండలం కలవళ్ళ గ్రామంలో బుధవారం రాత్రి అబ్బూరి లక్ష్మీనరసింహం, శ్రీకుమారి కుమారుడు నరేష్, స్వాతి చౌదరి వివాహం జరగగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..గ్రామ నాయకులు మోదేపల్లి నారాయణ, మన్నం అయ్యప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు పట్టణంలోని తూర్పుకమ్మపాలెంలో పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాటిబండ్ల హాజరత్తయ్య కుమారులు పంచెకట్టు కార్యక్రమం బుధవారం రాత్రి జరగగా కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు హాజరై చిన్నారులను ఆశీర్వదించారు ..టీడీపీ నాయకులు ఘట్టమనేని లక్ష్మీనరసింహం, సోంపల్లి మనోహర్, రాజవరపు మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.