తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ ఏలూరుపాడు పంచాయతీలో వేసవి సెలవులు-కిషోరీ వికాసం కార్యక్రమాన్ని ఉలవపాడు ప్రాజెక్ట్ సిడిపిఓ మాధవి లత ఆదేశాల మేరకుఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సూపర్వైజర్ కామేశ్వరి మాట్లాడుతూ అక్కడికి వచ్చిన బాల బాలికలకు ఆర్థిక నిర్వహణ గురించి తెలియపరచడం జరిగింది. డబ్బు అనేది ఒక సాధనమని లక్ష్యం కాదని డబ్బును చాలా తెలివిగా ఉపయోగించుకోవాలని సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం వలన అది ముందు ముందు రోజుల్లో అనేక రకాలుగా ఉపయోగపడుతుందని అలాగే డబ్బులు దుర్వినియోగం చేయడం వలన భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని. ఖర్చు చేసేముందు చాలా ఆలోచించి ఖర్చు చేయాలని. ప్రతి అమ్మాయి అబ్బాయిలు ఒక వారానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయడం ప్రారంభించాలని తెలియపరిచారు. వారు ఖర్చు చేసే మొత్తాన్ని ఒక డైరీలో కానీ పేపర్లో కానీ రాసుకోవాలని హుండీల ద్వారా ఎంతో కొంత మొత్తాన్ని దాచుకోవాలని డబ్బు నిర్వహణ గురించి కుటుంబంలో పెద్దలతో చర్చించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కామేశ్వరి. వి.వో. సౌమ్య ఆశ వర్కర్. మౌనిక. అంగన్వాడి కార్యకర్తలు తిరుపతమ్మ. మాలకొండమ్మ. ప్రసన్న కుమారి. ఆయాలు. మానస. కోటేశ్వరమ్మ. మమత బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు