తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు ( వికలాంగులకు) మోటరైజెడ్ త్రీ వీలర్ వాహనాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లా కలెక్టర్ విజయ సునీత గారు, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గారు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు, మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గార్లతో కలిసి గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుముల ఆశోక్ రెడ్డి గారు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిద్దలూరు నియోజకవర్గంలోని 10 మంది విభిన్న ప్రతిభవంతులను గుర్తించి త్రీ వీలర్ మోటర్ స్కూటర్లను ఎన్డీయే కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కష్టాలను గుర్తించి వారు కూడా అందరిలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనుటకు ఈ వాహనాలు ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని తెలిపారు