తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
భీమవరం లో ఓళ్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో భీమవరం చెరువు ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది.
వివరాల్లోకి వెళితే, ఓళ్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన వ్యక్తి భీమవరం ఎస్టీ కాలనీలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ కొలుపుల కార్యక్రమం జరుగుతుండగా అతను మద్యం సేవించాడు. అనంతరం కంట్రోల్ తప్పి వాహనంతో వెళుతూ భీమవరం చెరువు ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.