తొలి శుభోదయం న్యూస్ ముండ్లమూరు:-
ముండ్లమూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన రైతు వల్లేపు వెంకటేశ్వర్లు పంట వ్యర్థాలను తగలబెట్టే సమయంలో జరిగిన ప్రమాదంలో సజీవ దహనమవడం బాధాకరమని డా గొట్టిపాటి లక్ష్మీ విచారం వ్యక్తం చేశారు.మంటలు బోరు వైర్లకు అంటుకుంటాయనే ఆందోళనతో వెళ్లిన వెంకటేశ్వర్లు ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో మంటలు చుట్టుముట్టి మృతి చెందినట్లు తెలిపారు.మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆమె, రైతులు పంట వ్యర్థాల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వల్లేపు నాగేశ్వరావుకు చెందిన మూడు ఎకరాల మిరప తోట దగ్ధమవడం కూడా బాధాకరమని పేర్కొంటూ, అధికారులతో మాట్లాడి వారి కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని తెలిపారు.