స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, మండలంలోని అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు, సహాయకులకు బుధవారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని, వంటల పోటీలను నిర్వహించారు. టాటా ట్రస్టు సహకారంతో విజయవాహిని చారిటబుల్ ట్రస్టు ఫౌండేషన్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, పత్తి.శ్రీనివాసులు హాజరై కుక్ కం హెల్పర్లకు ఆహార నాణ్యత,పరిశుభ్రతలపై సూచనలు ఇచ్చారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎండిఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.రాజ లీలావతి వంట నిర్వాహకులకు ఆహార బలవర్ధకత,నాణ్యతా ప్రమాణాలను గురించి క్షుణ్ణంగా వివరించారు. ప్లస్ ఎఫ్ గుర్తు ఉన్న ఉప్పు, నూనె, నిత్యావసర సరుకులు వినియోగించడం ద్వారా పోషకాహార లోపాలను నివారించవచ్చనీ, మధ్యాహ్న భోజన నిర్వహణలో రుచి, నాణ్యత, పరిశుభ్రతలకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా వంటపోటీలలో ప్రతిభ చూపిన నిర్వాహకులకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, పత్తి శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వీరనారాయణ, సిఆర్పీలు అనురాధ, మురళీమోహన్, రవీంద్ర నాయక్,డేటా. ఆపరేటర్ వై.శేఖర్,మండల సమన్వయకర్త చిన్ని.పద్మావతి,మండల అకౌంటెంట్ రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *