తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి 9 మంది జూదరులను పట్టుకుని నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్లపాడు గ్రామంలో ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించిన జూదం దాడిలో 4 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,360 నగదును స్వాధీనం చేసుకున్నారు.అదేవిధంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముప్పాళ్ల గ్రామ శివారులో నిర్వహించిన మరో దాడిలో 5 మంది జూదరులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.2,190 నగదు మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలు మరియు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.