సమావేశంలో పాల్గొన్న మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం న్యూస్ అమరావతి :-
కేంద్ర మంత్రి రాందాస్ అద్వాలే అధ్యక్షతన జామ్ వేదికగా నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ జస్టిస్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు జామ్ లో హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సమావేశంలో మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….పీఎం ఆదర్శ గ్రామ యోజనకి అదనంగా రూ. 50 లక్షలు పెంచాలని కోరారు. రాష్ట్రానికి నూతనంగా 58 సంక్షేమ హాస్టళ్లు మంజూరు చేయాలని, హాస్టళ్ల నిర్మాణం కోసం ఇచ్చే రూ. 3 లక్షలను రూ.5 లక్షలకు పెంచాలని మంత్రి డిఎస్ బీవీ స్వామి కోరారు. పీఎం అజయ్ కింద ఇచ్చే రుణాలను అధికశాతం మహిళలకు ఇవ్వాలని, రుణాలకు మహిళలకు 50 శాతం సబ్సిడీ వర్తింపచేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు. ఎస్సీల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎస్సిల విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సమాజంలో ఎస్సీలు అనే విధాల అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం నాయక్, డైరెక్టర్ బి. లావణ్య వేణి తదితరులు పాల్గొన్నారు