తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
అక్రమ జూదం మరియు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా రాచర్ల పోలీసులు రాచర్ల ఫారం గ్రామ శివారులో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దాడి సందర్భంగా నిందితుల వద్ద నుంచి రూ.6,600 నగదు మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, ప్రజలు కూడా తమ పరిసరాల్లో జూదం, మట్కా, క్రికెట్ బెట్టింగ్ లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.