మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ లో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన భారీసభలో రాష్ట్ర హోంశాఖమంత్రి వంగలపూడి అనిత గారు, సాంఘికసంక్షేమ శాఖమంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.కందుకూరు నియోజకవర్గ టీడీపీ టిడిపి నేతలు రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, బద్దిపూడి శిఖామణి, సుదర్శి శ్యామ్, పులి నాగరాజు, చనుమాల శ్రీధర్, మెండా లెనిన్, ఈదర నరసయ్య తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *