తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
మహిళలు, బాలికల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందించేందుకు ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు మరియు వివిధ సామాజిక వేదికలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో శక్తి యాప్ ప్రాముఖ్యత, వినియోగ విధానం మరియు అత్యవసర సమయంలో SOS ఫీచర్ ద్వారా పోలీసులకు ఎలా సమాచారం చేరుతుందో వివరిస్తున్నారు.మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే శక్తి యాప్ ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని తెలియజేస్తున్నారు. అలాగే మహిళలు తమ భద్రతకు సంబంధించిన అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.మహిళల భద్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించడం మరియు సాంకేతికత ఆధారిత భద్రతా వ్యవస్థలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా సురక్షిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.