మంగళవారం కళాశాలలో యోగాంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా మాజీ ఐఏఎస్ . ఎల్.వెంకటేశ్వర్లు హాజరయ్యారు. కార్యక్రమం లో భాగంగా వారు మాట్లాడుతూ
యోగ అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతుల్యతను సాధించడానికి ఉపయోగపడే ప్రాచీన భారతీయ విధానం అని అన్నారు. యోగాసనాలు వేయడం ద్వారా శారీరక ఆరోగ్యం, కండరాలు మరియు కీళ్ల పనితీరు మెరుగుపడుతుందని అన్నారు. అంతే కాక మానసిక ప్రశాంతత కలగటం తో పాటు ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి అని అన్నారు.ఏకాగ్రత పెరుగుదలకు, జ్ఞాపకశక్తి మరియు దృష్టి కేంద్రీకరణ మెరుగుపడుటకు యోగాసనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుందని, శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలను నియంత్రణ లో ఉంటాయని అన్నారు.కార్యక్రమం లో జిల్లా వృత్తి విద్యా అధికారి ఆంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ జయమాలతి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *