తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
జూలై 11 వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి పోలీస్ అధికారులతో గిద్దలూరు మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె. భరత్ చంద్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. గిద్దలూరు కోర్టుల పరిధిలోని ఆరు మండలాల పోలీస్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాజీపడదగిన క్రిమినల్ కేసులందు కక్షిదారులను గుర్తించి, వారి కేసులను రాజీ చేసుకోవడం ద్వారా విలువైన సమయమును మరియు ధనమును ఆదా చేసుకుంటారని, అప్పీలు లేని అవార్డును పొందవలసినదిగా అవగాహన కల్పించాలని జడ్జి గారు పోలీస్ అధికారులకు తెలియజేసారు. ఈ జాతీయ లోక్ ఆదాలత్ నందు అన్ని రకముల సివిల్ కేసులు, భరణం, గృహహింస, చెక్ బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు మరియు న్యాయస్థానాల వరకు వెళ్ళని ప్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేసుకుని, ప్రశాంతమైన జీవితమును గడపాలని ఆయన కక్షిదారులకు పిలుపునిచ్చారు. ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చర్యలు చేపట్టవలసినదిగా పోలీస్ అధికారులకు జడ్జి గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు అర్బన్ ఇన్స్పెక్టర్ కె.సురేష్, అర్థవీడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం శివ నాంచారయ్య, గిద్దలూరు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.