తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు పొదిలి ఎస్సై గారు మరియు పోలీస్ సిబ్బంది పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోగినేనివారిపాలెం గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదంలో పాల్గొంటున్న 11 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.50,160 నగదు, 12 సెల్‌ఫోన్లు మరియు 8 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు కుటుంబాలను, సమాజాన్ని ఆర్థికంగా మరియు సామాజికంగా దెబ్బతీస్తాయని తెలిపారు. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలపై మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు కొనసాగిస్తారని హెచ్చరించారు.జిల్లాలో ఎక్కడైనా జూదం, గంజాయి, మాదకద్రవ్యాలు లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్-112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.