google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

లింగసముద్రం మండలంలోని యర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వరకు కొత్తగా నడపబోతున్న ఆర్టీసీ బస్సు సర్వీసును…. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు గురువారం ప్రారంభించారు. కందుకూరు పట్టణంలోని ఆర్టీసీడిపో వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టి, జెండా ఊపి సర్వీసును ప్రారంభించారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…. యర్రారెడ్డిపాలెంనుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్ వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమంలో, గ్రామస్తులు ఈ సమస్యను మా దృష్టికి తెచ్చారు. వారి విజ్ఞప్తితో ఈరోజు బస్సు సర్వీసు ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలోని 92 పంచాయతీలలో, ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ప్రతి స్కూల్ కు బస్సు నడుపుతున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం… మహిళలకు చాలా ఉపయోగంగా ఉంది.కందుకూరు డిపోలో, 15 సంవత్సరాలు దాటిన బస్సులు 28 ఉన్నాయి. అవన్నీ పక్కనపెట్టి, వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆర్టీసీ మంత్రి గారు అందుకు హామీ ఇచ్చి ఉన్నారు. ప్రయాణం సురక్షితంగా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులలో మాత్రమే ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను… అని ఎమ్మెల్యే నాగేశ్వరావు గారు పేర్కొన్నారు.అనంతరం ఆర్టీసీ డిపో సమీపంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు పరిశీలించారు. ప్రయాణికులకు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆర్టీసీ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు, పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు రెబ్బవరపు మాల్యాద్రి, ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు సవిడిబోయిన వెంకటకృష్ణ, బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు వేణు, సీనియర్ నాయకులు షేక్ రఫీ, అత్తింటి శ్రీహరి నాయుడు, చుండూరి శ్రీను, పొడపాటి మాధవ, వడ్డేళ్ల వెంకట్రావు, పువ్వాడి కోటయ్య, జియావుద్దీన్, పసుపులేటి రమణయ్య, ఇంకా యర్రారెడ్డిపాలెం గ్రామస్తులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *