సింగరాయకొండ మండలంలోని ఎంపీపీ స్కూల్, బాలయోగి నగర్ నందు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాత సుబ్బారెడ్డి 100 నోటు పుస్తకాలు మరియు స్టేషనరీ అందించి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న మండల అభివృద్ధి అధికారి జయమణి ఈ సందర్బంగా మాట్లాడుతూ, “ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సమాజం నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభించడం ఎంతో అభినందనీయం. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలి. విద్య ద్వారా మాత్రమే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి” అని అన్నారు.కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ దాసరి పావని మాట్లాడుతూ, “విద్యతో పాటు విద్యార్థులు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిశుభ్రత, పోషకాహారం, క్రమమైన వ్యాయామం అలవాటు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదుగుతారు. మంచి ఆరోగ్యమే మంచి విద్యకు పునాది” అని సూచించారు.కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొల్లూరి వెంకయ్య, ఉపాధ్యాయులు చిడితోటి నరేంద్ర,మారుతీ దేవి, హిమబిందు,న్యాయవాది పఠాన్ రియాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించవలచిన బాధ్యత ఎంతైనా ఉన్నది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *