తొలి శుభోదయం న్యూస్ కామేపల్లి:-
కామేపల్లి గ్రామంలో నిర్వహించనున్న శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఒంగోలు డీఎస్పీ శ్రీ ఆర్. శ్రీనివాసరావు గారు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా డీఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తిరునాళ్లకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలను పోలీసు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని, రద్దీ ప్రాంతాల్లో ఓర్పుతో వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.అదేవిధంగా చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.సింగరాయకొండ సీఐ వై శ్రీహరి గారు జరుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై పి. భాగ్యరాజ్ బందోబస్తు ఏర్పాట్లు చూస్తున్నారు