google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనిచ్చే లక్ష్యంతో సింగరాయకొండ మండలం శ్రీనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు రూ.50 వేల విలువైన పుస్తకాలు, స్టేషనరీ సామగ్రిని దాతలు అందజేశారు.స్థానిక శ్రీ రాములవారి ఆలయ కమిటీ చైర్మన్ తన్నీరు రమణయ్య ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వెంకయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, రాజు, శ్రీను, ఏడుకొండలు, రవికుమార్, కోటేశ్వరరావు తదితరులు విశేష సహకారం అందించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పడటం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దాతలకు, ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.“ప్రభుత్వ పాఠశాల బలోపేతమే సమాజ ప్రగతికి బలమైన పునాది” అనే సందేశంతో కార్యక్రమం నిర్వహించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *